RAPO23లో బాలీవుడ్ స్టార్..
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని(ram pothineni) తన కెరీర్లో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. RAPO23 సినిమాతో డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రామ్ స్పెషల్ స్టోరీ వరల్డ్ ను రెడీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా న్యూ నోయిర్ శైలిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. కథకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి క్యారెక్టర్ ను జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్(Riteish deshmukh) తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్, రితేష్ ను సెట్స్ లోకి ఆహ్వానించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలోని భారీ సెట్స్‌తో పాటూ సినిమాను ప్రిస్టీజియస్ గా రూపొందించేందుకు యూనిట్ చేస్తున్న కృషి ఈ వీడియోలో కనిపిస్తోంది. రితేష్ రాకతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha menon) హీరోయిన్ గా నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కు సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ అనుభూతిని అందించాలని రామ్ భావిస్తున్నారు. కృష్ణ పోతినేని(Krishna pothineni) భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా రామ్ ఎలాంటి కథనాన్ని ఎంచుకున్నారు? ఈ విభిన్న ప్రయత్నం ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.








