Rishab Shetty: జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చిన రిషబ్
ఎక్కడైనా సరే ఒకే తరహా ఉంటే వాటికి పోలికలు తప్పవు. అది వస్తువైనా, సినిమా కథైనా. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒకే జానర్ లో ఎక్కువ సినిమాలు వస్తే తెలియకుండానే ఆడియన్స్ కంపేరిజన్స్ మొదలుపెడుతుంటారు. తాము తీసుకున్న లైన్ కు కాస్త అటూ ఇటుగా ఎవరైనా ఆ లైన్ ను టచ్ చేస్తే మేకర్స్ వెంటనే కంగారు పడి తన ప్రాజెక్టును రిలీజ్ చేయాలనుకుంటారు.
ఇప్పుడు ప్రశాంత్ వర్మ(prasanth varma) కూడా అదే చేస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి హను మాన్(hanu man) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ప్రశాంత్ వర్మ ఆ సినిమాను చిన్న మూవీగా రిలీజ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. హను మాన్ సినిమాకు రామాయణం టచ్ ఇచ్చి, దానికి సీక్వెల్ గా జై హనుమాన్(jai hanuman) ఉంటుందని చెప్పాడు.
వాస్తవానికి జై హనుమాన్ ను ఈ ఇయర్ సంక్రాంతికే రిలీజ్ చేద్దామని అనుకున్నాడు కానీ పలు కారణాలతో కుదరలేదు. ఈ మూవీలో హనుమాన్ గా రిషబ్ శెట్టి(rishab shetty) నటిస్తుండగా, రిషబ్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల జై హనుమాన్ ముందుకు కదల్లేదు. అయితే ఇప్పుడు రిషబ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చాడని, జనవరి నుంచి జూన్ వరకు రిషబ్ ఈ సినిమా కోసం కాల్షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అసలే రీసెంట్ గా రాజమౌళి(rajamouli) వారణాసి(varanasi) సినిమాను అనౌన్స్ చేసి ఆ సినిమాకు రామాయణం టచ్ ఇస్తున్నట్టు క్లారిటీ ఇవ్వడంతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.






