Rishab Shetty: అందుకే జై హనుమాన్ ఒప్పుకున్నా

కాంతార(kaanthara) సినిమాతో రిషబ్ శెట్టి(rishab shetty) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ సినిమా స్థాయిని కాంతార మరో లెవెల్ కు తీసుకెళ్లిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ కాంతార చాప్టర్1(kanthara chapter1) తెరకెక్కింది. అక్టోబర్ 2న కాంతార1 పలు భాషల్లో రిలీజ్ కానుండగా, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రిషబ్ శెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నాడు.
అందులో భాగంగానే రిషబ్ శెట్టి చేయనున్న జై హనుమాన్(jai Hanuman) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాంతార1 కు ముందు తాను మరో సినిమాకు సైన్ చేయకూడదనుకున్నానని, కానీ ప్రశాంత్ వర్మ(prasanth Varma) చెప్పిన కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని, స్క్రిప్ట్ చాలా గొప్పగా ఉండటంతో పాటూ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో వెంటనే ఓకే చెప్పానని అన్నాడు రిషబ్ శెట్టి.
ఆల్రెడీ జై హనుమాన్ ఫోటో షూట్ పూర్తి చేశామని చెప్పిన రిషబ్, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారో మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని కూడా రిషబ్ శెట్టి చెప్పాడు. హను మాన్(hanu man) కు సీక్వెల్ గా రానున్న జై హనుమాన్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.