‘బిగ్ బాస్ చూడను కానీ అరియానాను వదిలేది లేదు’ : రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ తనకు నచ్చినట్టు జీవించే వ్యక్తి. ఎలాంటి వారికైనా తన స్టైల్ లో జవాబిస్తాడు. ఇతన్ని విమర్శించేవాళ్ళు వాళ్ళు నవ్వుల పాలవుతారు తప్ప ఈయన నవ్వుల పాలు అవ్వడు.కాంట్రవర్సీ కి ఈయన కేర్ ఆఫ్ అడ్రస్. ఎలాంటి ఇంటర్వ్యూ అయినా, పబ్లిక్ మీట్ అయినా మనసులో మాటను నిర్మొహమాటంగా బయటపెట్టడం ఒక్క వర్మకే చెల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తనకేదనిపిస్తే అది వెంటనే చెప్పేయడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన మాట్లాడిన మాటలు సెన్సేషన్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ బ్యూటీ అరియానాపై తన మనసులో మాట చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.
‘బిగ్ బాస్ చూడను కానీ అరియానాను వదలను’ అంటూ వర్మ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సంచలనం అవుతోంది. అరియానా తో సినిమా తీస్తానని చెప్పాడు.గతంలో అరియానాతో ఓ ఇంటర్వ్యూలో…. మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్! అనిపిస్తుంది అని అడిగితే ‘నువ్వే’ అని సమాధానం ఇచ్చి షాకిచ్చాడు. అంతేకాదు నిన్ను బికినీలో నిన్ను చూడాలని ఉందంటూ సంచలనం సృష్టించారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అరియానా పేరు మారుమోగిపోయింది. దీంతో అరియానాకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ 4లో ఛాన్స్ కొట్టేసింది అరియానా. స్ట్రాంగ్ కంటిస్టెంట్గా తానేంటో నిరూపించుకుంటుంది.













