సమంత మీదున్న బాధ్యతలు అవే..
అమెజాన్ కోసం రీసెంట్గా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆరు నెలల బ్రేక్ తీసుకుంది సమంత. గతంలో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి మరీ మానసిక ప్రశాంతత కోసం టూర్ కు వెళ్లింది. ఇందులో భాగంగా ముందు వేలూరులోని స్వర్ణ దేవాలయంని సందర్శించింది. ఆ తర్వాత ఈషా యోగా సెంటర్లో మెడిటేషన్ సెంటర్లో సెలవిచ్చింది.
అక్కడి నుంచి బాలికి వెళ్లిపోయి ఏరియల్ యోగాసనాలతో శారీరకంగా, మానసికంగా దృఢంగా మారే దిశగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఆ విషయాల్ని సోషల్ మీడియలో షేర్ చేసుకుంటుంది. అయితే సమంత నటించిన ఖుషి సినిమా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ కానుంది. దాని ప్రమోషన్స్ కు అయినా సమంత ఈ ట్రిప్ నుంచి బ్రేక్ తీసుకుని వస్తుందో లేదో చూడాలి.
ఒకవేళ సమంత రాలేకపోతే చిత్ర యూనిటే ఆమె ఉన్న దగ్గరకి ఇంటర్వ్యూలు చేసి మీడియాకు ఇస్తారు. గతంలో యశోద సినిమా విషయంలో అదే జరిగింది. కానీ సిటాడెల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యాక మాత్రం దాని ప్రమోషన్లలో సమంత కచ్ఛితంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఆ రూల్ అగ్రిమెంట్ లో ఉంటుంది కాబట్టి సామ్ అప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిందే.
ఖుషి, సిటాడెల్ ప్రమోషన్స్ తప్పించి సమంత మీద మరే బాధ్యతలు లేవు. అందుకే తన హెయిర్ స్టైల్ ని కూడా మార్చి షార్ట్ హెయిర్ ను ఉంచుకుంది. చేతిలో భారీ ఆఫర్లున్నా ఆమె ఆరోగ్య విషయంలో డాక్టర్లు చేసిన సూచన మేరకు సమంత ఇలా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. యశోద సినిమాతో దారుణమైన డిజాస్టర్ ను అందుకున్న సమంత తన తర్వాతి సినిమా ఖుషి పైన భారీ ఆశలను పెట్టుకుంది.













