Regina: ఆ టైమ్ లో చాలా కష్టమనిపించింది
మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రెజీనా(Regina), 2005లో ఓ తమిళ సినిమాతో సినీ రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎస్ఎమ్ఎస్(SMS) అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రెజీనాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆ తర్వాత కెరీర్లో ఎన్నో సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన రెజీనా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది. ఈ
కెరీర్లో 20 ఏళ్ల మైల్ స్టోన్ ను అందుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెజీనా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలవుతున్నా కొన్ని విషయాల్లో తాను ఇంకా టాప్ ప్లేస్ లోకి రాలేదన్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా సినిమాలు చేయకపోయినా 20 ఏళ్లు ఇండస్ట్రీ లో ఉండటమంటే మాటలు కాదని రెజీనా చెప్పింది.
2015-16 మధ్య వర్క్ చేయాలని అనిపించక యాక్టింగ్ మానేద్దామనుకున్నానని, ఆ టైమ్ లో ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేశానని, మళ్లీ 2018 నుంచి వరుస అవకాశాలొచ్చాయని చెప్పింది రెజీనా. టాలీవుడ్ లో మొదట్లో ఉదయం 6 గంటలకే డైలాగ్ పేపర్ తెచ్చిచ్చేవాళ్లని, కానీ ఆ టైమ్ లో తెలుగు రాకపోవడంతో ఎంతో కష్టమైందని రెజీనా అన్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు యాక్టింగ్ అంటే నటించి వెళ్లిపోవడమే అనుకున్నానని, కానీ పీఆర్, సోషల్ మీడియాకు ప్రాధాన్యత ఉందని తెలియదని, ఇప్పుడు వాటి ప్రాధాన్యత తెలిసిందని రెజీనా చెప్పింది.







