Magic: మ్యాజిక్ డిలేకు కారణమేంటి?
అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainements) నిర్మిస్తున్న మేజిక్(Magic) సినిమా ఈ నెల 21న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతున్నట్లు మేకర్స్ నెల ఆరంభంలోనే వెల్లడించారు. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి కారణాలు చాలానే ఉన్నాయి.
అందులో మొదటిది డైరెక్టర్ గౌతమ్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమాతో బిజీగా ఉన్నాడు. మార్చి 28న సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ తో షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. దాంతో పాటూ మేజిక్ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్, నాలుగైదు రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి అనిరుధ్(Anirudh) డేట్స్ కూడా దొరకాలి.
సినిమా షూటింగ్ పూర్తై ఫస్ట్ కాపీ రెడీ అయితే తప్పించి అనిరుధ్ దగ్గరకు వెళ్లలేరు. అందుకే మేజిక్ సినిమా వాయిదా పడిందని, దీని కంటే ముందుగా మ్యాడ్ స్వ్కేర్(Mad Square) సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మ్యాడ్ స్వ్కేర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మేజిక్ ఇంకా లేటయితే వచ్చే సమ్మర్ తప్ప మరో ఆప్షన్ లేదు. మేజిక్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు.













