దేవర సైలెన్స్ వెనుక సీక్రెట్
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివతో చేస్తున్న దేవర సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు అక్టోబర్ 10కి ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. ఇదిలా ఉంటే దేవర సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంది.
అయితే ఈ సినిమా ప్రచారం విషయంలో కొరటాల శివ సైలెన్స్ వెనుక రీజన్ ఉందని తెలుస్తోంది. సినిమా గురించి ఎంత రహస్యంగా ఉంచితే థియేటర్లో ఆడియన్స్ అంత ఎగ్జైట్ అయ్యే ఛాన్సుందని, అందుకే మిగిలిన సినిమాల్లాగా దేవర హడావిడి చేయడం లేదని తెలుస్తోంది. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్న చిత్ర యూనిట్ ఏదైనా థియేటర్లోనేనని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, ఈ సినిమాతో దాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు కొరటాల కూడా దేవరతో ఎలాగైనా హిట్ కొట్టాలని తెగ తాపత్రయ పడుతున్నాడు.













