రీ రిలీజ్ లలో తగ్గేదేలే అంటున్న పవర్ స్టార్, సూపర్ స్టార్…
స్టార్ హీరోల ఫాన్స్ ఉత్సాహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ఫ్యాన్స్ హంగామా అయితే మాటల్లో చెప్పలేనిది. ఈ ఇద్దరు స్టార్స్ గత పాతికేళ్లుగా టాలీవుడ్ లో స్టార్డం కొనసాగిస్తున్నారు. అంతేకాదు వారి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు.
మహేష్, పవన్ ల పవర్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. ఒక జనరేషన్ ని ఊపేసిన హీరోలు వారిద్దరే అని చెప్పొచ్చు. రీ రిలీజ్ ల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ చేశారు. ఆ సినిమాను కలెక్షన్ల వర్షంతో మరోసారి బ్లాక్ బస్టర్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
ఇక లేటెస్ట్ గా జనవరి 7న మహేష్ ఒక్కడు సినిమా కూడా రీ రిలీజ్ చేశారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక్కడు హంగామా మొదలైంది. చాలా ఏరియాల్లో టికెట్ లు దొరక్క హౌస్ ఫుల్ బోర్డ్ లు పెట్టేశారు. ఈ ఇద్దరు హీరోల సినిమాల రీ రిలీజ్ కు ఇంత హడావిడి ఉండటం వారికి ఉన్న ఫ్యాన్ పవర్ ని తెలియచేస్తుంది. అప్పుడు థియేటర్లలో మిస్సైన వాళ్ళందరూ ఇప్పుడు రీ రిలీజ్ దయవల్ల మళ్ళీ ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ ని థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు.













