క్రేజీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ..
టాలీవుడ్ మాస్ మహారాజాగా హీరో రవితేజ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడన్న విషయం అందరికి తెలిసిందే. గత కొంతకాలంగా వరుస ప్లాప్ లతో రవితేజ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. “ధమాకా” తో మళ్ళీ ఈ హీరో హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా సైతం రవితేజకి మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన “టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర” అనే సినిమాల్లో నటిస్తున్నారు.
రీసెంట్ గా ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి కూడా ఈ మాస్ హీరో ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్తలన్నీ పక్కన పెడితే రవితేజ ఒక రీమేక్ మూవీ చేయబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ చిత్రం లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ రవి తేజతో కలిసి నటిస్తుండడం విశేషం. ఈ సినిమా గురించి డైరెక్టర్ దశరథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని ఈ సినిమాకి దర్శకత్వం వహించమని నిర్మాతలు అడిగారని ఆయన తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళంలో సూపర్ హిట్ అయిన “మానాడు” సినిమాని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారట.
తమిళంలో శింబు నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ హక్కులు తీసుకుంది. కానీ ‘మానాడు’ ఆల్రెడీ తెలుగులో డిజిటల్‌గా రిలీజ్ కావడంతో రీమేక్ మీద క్లారిటీ లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టు రెడీ చేసుకుని రీమేక్ చేయడానికే సురేష్ ప్రొడక్షన్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటు రవితేజ, అటు సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు మాస్ హీరోలే అవడంతో ఈ ప్రాజెక్ట్ పై మాస్ అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు.













