మిస్టర్ బచ్చన్ విషయంలో రవితేజ నిర్ణయం కరెక్టే!
మాస్ మహారాజా రవితేకు ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ దక్కింది లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఇలా చేసిన ప్రతీ ప్రయోగం దెబ్బ కొట్టింది. అందుకే ఈసారి రిస్క్ చేయకుండా తనకు మిరపకాయ్ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వలో బాలీవుడ్ హిట్ రైడ్ ను రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు.
ముందుగా ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు అందరికీ డౌట్స్ ఉండేవి. అసలు ఆ కథ తెలుగు నేటివిటీకి సెట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశార. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ షో రీల్ ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేసింది. డైలాగ్స్ లేకుండా మొత్తం యాక్షన్ సీన్స్ తోనే కట్ చేసిన ఈ షో రీల్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.
నిజానికి రైడ్ కమర్షియల్ సబ్జెక్ట్ కాదు. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచే రైడ్ లో ఆర్టిస్టులు కూడా పెద్దగా ఉండరు. దాన్ని హరీష్ శంకర్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్ కథను మాత్రమే తీసుకుని తనదైన ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గా జగపతిబాబును సెలెక్ట్ చేసుకోవడం మంచి ఛాయిస్. ఇకపోతే ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేస్తోంది.













