టైగర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..
బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా క్రేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. చాలా సైరా తో చిరంజీవి దగ్గర నుంచి పుష్ప తో బన్నీ, కార్తికేయ-2తో నిఖిల్ వరకు కొంత మంది పాన్ ఇండియన్ స్టార్లవ్వగా, మరికొంత మందికి ఆ పాన్ ఇండియన్ రిలీజ్ లు కలిసిరాకపోగా, బాగా బెడిసికొట్టాయి.
పాన్ ఇండియా సినిమా కావడం వల్ల ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ క్రేజ్, మార్కెట్ మరింత పెరిగాయి. వారిలాగే ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయిలో తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటివరకు తెలుగులో తప్ప మరే భాష గురించి పట్టించుకోని రవితేజ మొదటిసారి తన సినిమాను అన్ని భాషల్లోకి రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగుతో పాటూ మిగిలిన మార్కెట్లను కొల్లగొట్టగలననే నమ్మకంతో రవితేజ ఈ సినిమాను చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడట. రవితేజ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ కార్తికేయ2తో పాన్ ఇండియన్ సక్సెస్ చూసిన అభిషేక్ అగర్వాల్, టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్లను పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేశాడు.
పాన్ ఇండియన్ రేంజ్లో ఏదో రిలీజ్ చేశామంటే చేశామనుకోకుండా ఓ ప్లాన్ ప్రకారం, సినిమాను ప్రమోట్ చేసి థియేటర్లలోకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఒక్కో భాష నుంచి ఒక్కో పెద్ద స్టార్‌ను ప్రమోషన్ల కోసం రంగంలోకి దించనున్నారు. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేయబోతున్నారు.













