వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్న రవితేజ
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుని పోయే హీరోల్లో రవితేజ ఒకడు. రవితేజ ఇప్పుడు 60 సినిమాలకు దగ్గర పడ్డాడు. ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, రావాణాసుర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలరించనున్నాడు.
దాని తర్వాత మూడు నెలలకు సంక్రాంతికి ఈగల్ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ప్రస్తుతం రవితేజ ఈగల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాల షూటింగ్లో సమాంతరంగా పాల్గొంటున్నాడు. ఇవి కాకుండా రవితేజ మరో రెండు సినిమాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి కొత్త డైరెక్టర్ వాసుతో చేయబోతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది.
ఎప్పటినుంచో రవితేజతో సినిమా చేద్దామనుకుంటున్న సితార బ్యానర్‌కు వాసు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. వాస్తవానికి రవితేజ ఈ బ్యానర్లో ఎప్పుడో పనిచేయాల్సింది. గతంలో ఈ బ్యానర్లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో రానా క్యారెక్టర్ కోసం రవితేజను అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.
ఇది కాకుండా రెండోది రవితేజకు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడట మాస్ మహారాజా. దీంతో పాటూ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో కూడా మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో రవితేజ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గ్యాప్ అనేది లేకుండా రవితేజ సంవత్సారానికి రెండు మూడు సినిమాలు తీయడంలో చాలా బిజీగా ఉన్నాడు.













