Ravi Teja: రవితేజకు అర్జెంటుగా హిట్ పడాలి
రవితేజ(Ravi Teja) హీరోగా ఒక హిట్టు కొట్టాడంటే ఆ తర్వాత మరో హిట్ అందుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ధమాకా(Dhamaka) సినిమా తర్వాత రవితేజకు ఇప్పటివరకు మరో హిట్ పడింది లేదు. ధమాకా తర్వాత 2023లోనే రావణాసుర(Ravanasura), టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమాలు చేసిన రవితేజ ఆ సినిమాలతో భారీ ఫ్లాపులందుకున్నాడు. ఈ ఏడాది ఈగల్(eagle), మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాలతో రవితేజ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఆ సినిమాలు కూడా రవితేజకు ఫ్లాపులనే మిగిల్చాయి. ధమాకా(Dhamaka)తో సోలో హిట్ అందుకున్న తర్వాత రవితేజకు ఇప్పటి వరకు నాలుగు వరుస ఫ్లాపులొచ్చాయి. ఈ ఫ్లాపులు రవితేజ మార్కెట్ పై ఎంతోకొంత ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో రవితేజకు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ కావాలి. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర(mass jathara) సినిమా చేస్తున్నాడు.
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రవితేజ సెలెక్ట్ చేసుకున్న కథలు బావున్నా అవి డీల్ చేసే డైరెక్ట్ లేకపోవడం వల్లే సినిమాలు ఫ్లాపులవుతున్నాయి. రవితేజ ఎప్పుడెప్పుడు హిట్ కొడతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.













