ఆ లోటు తీరుస్తున్న హరీష్ శంకర్
హీరోయిన్ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని బయటకు చూపించకుండా వారిని టీజ్ చేస్తూ ప్రేమించడం అనేది పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఉండే స్పెషల్. పూరీ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ దీన్ని గమనించవచ్చు. మరీ ముఖ్యంగా పూరీ రవితేజ కాంబోలో వచ్చిన సినిమాల్లో ఈ రకమైన సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి.
వీరి కాంబోలో సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రవితేజ కూడా ఈ మధ్య లవ్ స్టోరీస్ చేయకుండా సీరియస్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. దీంతో హీరోయిన్స్ తో రవితేజ చేసే రొమాన్స్ ను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ లోటును తీర్చే ప్రయత్నం హరీష్ శంకర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, హీరోయిన్ ను టీజ్ చేసే సీన్స్ ను హరీష్ ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్ గా వాలెంటైన్స్ డే కు రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరోయిన్ నడుమును పట్టుకున్న రవితేజ, ఇడియట్ సినిమాలో మాదిరే కనిపించాడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మొత్తానికి హరీష్ శంకర్, రవితేజతో మరోసారి మిరపకాయ్ లాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మిస్టర్ బచ్చన్ ను ఈ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













