Mass Jathara: విక్రమార్కుడు వైబ్స్‌ను గుర్తు తెస్తున్న మాస్ జాతర గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ధమాకా(Dhamaka) సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ అది రవితేజ సోలో సినిమా కాకపోవడంతో రవితేజ హిట్ ఎప్పుడు కొడతాడా అని ఆయన ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ధమాకా తర్వాత వచ్చిన ఈగల్(Eagle), టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao), ఖిలాడీ(Khiladi), మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులయ్యాయి.
దీంతో ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ ఆశలన్నీ మాస్ జాతర(Mass Jathara) సినిమాపైనే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇవాళ రవితేజ బర్త్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూశాక ఒక్కసారి విక్రమార్కుడు(Vikramarkudu) వైబ్స్ గుర్తొచ్చాయి.
చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ రవితేజ కనిపించాడని, పోలీస్ యూనిఫామ్ లో రవితేజ కనిపించిన ప్రతీసారీ సినిమా హిట్టేనని తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. కథకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వకుండా బాగానే జాగ్రత్త పడింది టీమ్. భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటిస్తుంది.













