బాలయ్య బదులు రవితేజ!
మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియమ్ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో ఎవరీతో రీమేక్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ రానా కలిసి నటిస్తారనే ప్రచారం జరగసాగింది. ఈ చిత్ర నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ సైతం భాగస్వామి అవుతుందని తెలిసింది. దాంతో ఒక పాత్రలో రానా నటించడం ఖాయం అంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ మాత్రం తనకు ఇతర కమిట్మెంట్స్ ఉన్న కారణంగా నటించలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. తాజాగా రవితేజ పేరు వినిపిస్తోంది. దీనిపై సృష్టత రావాల్సి ఉంది. రవితేజ మరో కొత్త చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. రమేష్ వర్మ (రాక్షసుడు) ఫేమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని, ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తారనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి సృష్టత రావాల్సి ఉంది. ఇందులో మాళవిక శర్మ (నేల టిక్కెట్టు ఫేమ్) హీరోయిన్గా నటించే అవకాశం ఉంది.













