ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్ మార్చాల్సిందే!
కెజిఎఫ్(KGF) సినిమా ముందు వరకు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే పరిచయమున్న రవి బస్రూర్(Ravi Basrur) ఆ సినిమా తర్వాత మిగిలిన అన్ని భాషల ఆడియన్స్ కు తన సంగీతంతో పరియమయ్యాడు. బీజీఎం, ఎమోషనల్ సాంగ్స్ తో తనను తాను రవి బస్రూర్ చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్(Prabhas) తో ఛాన్స్ అందుకుని సలార్(Salaar) సినిమా చేసి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
అయితే రవి బస్రూర్ ప్రతి సినిమాకు ఒకే తరహా మ్యూజిక్ ఇస్తున్నాడనేది అతనిపై వినిపిస్తున్న కంప్లైంట్. తెలుగులో ఆయన్నుంచి వచ్చిన మార్షల్(Marshal), శాసనసభ(Saasana sabha), భీమా(Bheema) సినిమాలతో కనీస గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయాడు. బాలీవుడ్ లో కిసీకా భాయ్ కిసీకా జాన్(Kisika Bhai Kisika Jhan) బీజీఎం కోసం ఆయన్ని తీసుకోగా ఆ సినిమా విషయంలో కూడా నిరాశే మిగిల్చాడు.
కబ్జా(Kabja) సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన మార్టిన్ వరకు ఇదే తంతు. అనిరుధ్(Anirudh) లాగా రవి బస్రూర్ అన్ని భాషల్లో ఒకేలా తనదైన ముద్ర వేసుకోలేకపోతున్నాడు. ప్రతి సినిమాలోనూ కెజిఎఫ్ తరహా సౌండింగ్ ను రిపీట్ చేయడం చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన కంపోజింగ్ లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రవి బస్రూర్ చేతిలో ఎన్టీఆర్(NTR)- ప్రశాంత్ నీల్(Prasanth Neel) సినిమా ఉంది. సలార్2(salaar2) కు కూడా ఆయనే సంగీతం అందించనున్నాడు. ఇప్పటికైనా రవి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయకపోతే తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే.













