Rashmika: మరోసారి విజయ్ రష్మిక నటిస్తున్నారా?
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri)తో కింగ్డమ్(Kingdom) చేస్తున్న విజయ్ దేవరకొండ(Vijay devarakonda) దాని తర్వాత తనకు ట్యాక్సీవాలా(Taxiwala) లాంటి సూపర్ హిట్ ను ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్(rahul sankrityan) దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ మూవీని అనౌన్స్ చేసిన చిత్ర టీమ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటూ సెట్ వర్క్స్ లో బిజీగా ఉంది.
శ్యామ్ సింగరాయ్(Shyam Singaroy) తర్వాత రెండేళ్ల పాటూ ఇదే కథపై వర్క్ చేసిన రాహుల్, ఈ సినిమాతో విజయ్ తో కలిసి ప్రయోగం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో విజయ్ కు జోడీగా రష్మిక(Rashmika) నటిస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) రెస్పాండ్ అవుతూ #HMMLetsee అని రష్మికను ట్యాగ్ చేసింది.
ఆ ట్వీట్ కు రష్మిక ఓకే అంటూ నవ్వుతూ ఉండే ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో రాహుల్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ అనే విషయం ఫిక్సై పోయింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, విజయ్ తో కలిసి నటిస్తే ఈ సినిమాకు రష్మిక స్పెషల్ ఎట్రాక్షన్ అవడం ఖాయం. ఆల్రెడీ విజయ్ రష్మిక కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాలో రష్మిక నటిస్తుందనడంతో సినిమాపై మంచి హైప్ నెలకొంది.






