ఫ్యామిలీ స్టార్ లో రష్మిక ఉన్నట్టా? లేనట్టా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన ఐరనే వంచాలా ఏంటి టీజర్, సినిమాపై ఉన్న అంచనాలను పెంచింది.
గీత గోవిందం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక కూడా భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ చేస్తుందని కూడా వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇంతకీ విజయ్ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక ఉన్నట్టా లేనట్టా అనే డౌట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీత గోవిందంలో రష్మికనే హీరోయిన్ కావడం, ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్‌తోనే రష్మికను ఫ్యామిలీ స్టార్ లో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.













