బాలీవుడ్ విషయంలో రాంగ్ స్టెప్ వేసిన రష్మిక
టాలీవుడ్ లో సత్తా చాటుకున్నాక బాలీవుడ్ లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని హీరోయిన్స్ కు అనిపించడం మామూలే. ఇది ఎవరికీ మినహాయింపు కాదు. కాకపోతే తర్వాత నార్త్ హీరోయిన్లకు పోటీ ఇవ్వలేక వెనక్కు వచ్చేసే బ్యాచే ఎక్కువ. అలా కాకుండా రియాలిటీని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.
పుష్ప సినిమాతో శ్రీవల్లిగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మక ఈ విషయంలో మాత్రం మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. రీసెంట్ గా రష్మిక నితిన్- వెంకీ కుడముల కాంబోలో వస్తున్న సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ ఛాన్స్ ను టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కొట్టేసింది. దీనికి కారణం రష్మిక గతంలో షాహిద్ కపూర్ సినిమా కు ఇచ్చిన కమిట్మెంట్.
ఆగస్ట్ 1నుంచి స్టార్ట్ కావాల్సిన ఈ యాక్షన్ డ్రామాని క్యాన్సిల్ చేసినట్లు ముంబై సినీ వర్గాలు చెప్తున్నాయి. అనీజ్ బాజ్మీ డైరెక్షన్ లో షాహిద్ డబుల్ రోల్ లో ఈ సినిమాను భారీ గా ప్లాన్ చేశారు. ఏమైందో ఏమో కానీ బడ్జెట్ కారణంగా ఈ సినిమాను ఆపేస్తున్నారంటూ తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు రష్మిక ఇచ్చిన కాల్షీట్స్ వేస్ట్ అవుతాయి.
ఆ డేట్స్ ను రైన్ బో, పుష్ప2 సినిమాల కోసం వాడుకోవచ్చు కానీ బాలీవుడ్ లో తన సత్తా చాటాలన్న రష్మిక కలలు మాత్రం నెరవేరవు. యానిమల్ మూవీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ డిసెంబర్ కు వాయిదా పడింది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయినా సరే ఆ క్రెడిట్ హీరో, డైరెక్టర్ కే వెళ్తాయి తప్పించి రష్మిక కు రాదు. ఇప్పటికైనా రష్మిక బాలీవుడ్ మీద ధ్యాస తగ్గించి, సౌత్ సినిమాలపై ఫోకస్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.













