Rashmika Mandanna: మిగతా హీరోయిన్లకు ఈర్ష్య పుట్టిస్తున్న రష్మిక కెరీర్
కష్టపడే తత్వం, టాలెంట్ ఉంటే గుర్తింపు అదే వస్తుందనే విషయం కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna)ని చూస్తే అర్థమవుతుంది. కిరిక్ పార్టీ(Kirrik Party)తో కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగే పనిలేకుండా కెరీర్లో దూసుకెళ్తుంది. తెలుగులో తన హవా కొనసాగిస్తూనే బాలీవుడ్ ఆఫర్లు అందుకుని అక్కడ కూడా తన సత్తా చాటుతుంది.
దీంతో ఇప్పుడు సినిమాలో రష్మిక ఉంటే చాలు హిట్ అనే భావనలో అందరూ ఉన్నారు. ఈ క్రమంలోనే రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాలు రావడం కామనే కానీ వాటిలో హిట్ కథలను సెలెక్ట్ చేసుకోవడం అంత సులభం కాదు. కానీ రష్మిక ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంది.
తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా చేస్తున్న రష్మిక హిందీలో సల్మాన్(Salman) తో సికిందర్(Sikinder) చేస్తూనే చావా(Chaawa)ను పూర్తి చేస్తుంది. తాజాగా షాహిద్ కపూర్(Shahid Kapoor) తో కాక్ టెయిల్(Cock Tail) లో కూడా రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. రష్మిక దూకుడు చూసి మిగిలిన హీరోయిన్లు కుళ్లుకునేలా తన కెరీర్ దూసుకెళ్తుంది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా టాప్ హీరోయిన్ ఎవరంటే వెంటనే అందరూ రష్మిక పేరు చెప్పేలా అమ్మడు ఎదిగింది.













