తమ్ముడితో చేస్తే అన్నయ్యతో ఆఫర్
రష్మిక మందన ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో క్రేజీగా వినిపిస్తున్న కథానాయిక పేరు. ఇప్పటికే ఈ రెండు భాషల్లో పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక లేటెస్ట్గా మరో బంపర్ ఆఫర్‌ని దక్కించుకుందని సమాచారం. సూర్య, హరి కాంబినేషన్లో తెరకెక్కబోయే మాస్ ఎంటర్టైనర్లో కథానాయికగా రష్మికని ఎంపిక చేశారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఓ పక్క తమ్ముడు కార్తీ సుల్తాన్ చిత్రంలో నటిస్తూనే మరో పక్క అన్న సూర్య సినిమాలోనూ నటించేందుకు రష్మిక గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం.













