Dragon: డ్రాగన్ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్

దేవర(Devara) తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంతో అందరికీ దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ సినిమా డ్రాగన్(Dragon) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే డ్రాగన్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ ను రష్మిక మందన్నా(Rashmika Mandanna) చేయబోతుంది సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఆమెను అప్రోచ్ అయ్యాడని, రష్మిక కూడా ఆ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది. కథకు అనుగుణంగా ఈ సాంగ్ సెకండాఫ్ లో వస్తుందని టాక్.
ఈ సినిమాను నీల్ ఎంతో భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ను మునుపెన్నడూ చూపించనంత మాస్ గా, స్టైలిష్ గా నీల్ ఈ మూవీలో చూపించనున్నాడట. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని టాక్. రీసెంట్ గా ఓ సందర్భంలో నీల్ మాట్లాడుతూ ఈ సినిమాను తాను ఆడియన్స్ ఊహించని స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు చెప్పడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.