Rashmika Mandanna: టాలీవుడ్ నెం.1 హీరోయిన్ గా రష్మిక
టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ కుర్చీ మరోసారి రష్మిక(Rashmika) నే వరించింది. గతేడాది యానిమల్(Animal) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న రష్మిక రీసెంట్ గా పుష్ప2(Pushpa2)తో మరో సెన్సేషనల్ హిట్ అందుకుంది. నటనతో పాటూ గ్లామర్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రష్మిక దూసుకెళ్తుంది.
పుష్ప2 విజయంతో రష్మిక నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది. రష్మిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేస్తుండటంతో అమ్మడికి వరుస అవకాశాలొస్తున్నాయి. అదిరిపోయే అవకాశాలతో ఎవరైనా తన తర్వాతే అనిపించేలా ఫాలోయింగ్ ను పెంచుకున్న రష్మిక మొన్నటివరకు సౌత్ లో సత్తా చాటింది. యానిమల్ తర్వాత బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తోంది.
రష్మిక ఫాం చూస్తుంటే ఇప్పట్లో తన క్రేజ్ తగ్గే ఛాన్స్ ఏ మాత్రం లేనట్లనిపిస్తోంది. సౌత్ తో పోలిస్తే నార్త్ లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ రష్మిక ఎంపిక చేసుకుంటున్న కథలు, కాంబినేషన్స్ వల్ల ఆమెకు అదృష్టం కలిసొస్తుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి.













