ఎటు చూసినా రష్మిక మయమే!
పుష్ప, యానిమల్ సినిమాలు రష్మిక కెరీర్ ను పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్ ను చేశాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప2 సినిమాతో పాటు మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాకుండా మరో నాలుగైదు సినిమాలు డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలోనే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
మొత్తానికి చేతిలో అర డజనుకు పైగా సినిమాలతో రష్మిక సినీ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. ధనుష్- శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న కుబేర సినిమా, పుష్ప2, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఈ ఇయర్ లోనే పూర్తయిపోతాయి. నెక్ట్స్ ఇయర్ లో సల్మాన్ ఖాన్ సికిందర్, రెయిన్ బో, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు చేయనుంది.
విక్కీ కౌశల్ కు జోడీగా చావా అనే సినిమా కూడా చేస్తుంది. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లో కూడా రష్మికనే హీరోయిన్. దీనికంటే ముందే సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ లో కూడా రష్మికనే తీసుకోవాలనుకుంటున్నారట. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా ఎక్కడ చూసిన రష్మిక పేరే వినిపిస్తోంది.













