ఒకే ఇంట్లో రష్మిక, విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక లవ్ లో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలొస్తూనే ఉన్నాయి. గీత గోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం, ఆ సినిమా టైమ్ లోనే ప్రేమగా మారిందని, అందుకే రష్మిక తన ఎంగేజ్మెంట్ను సైతం బ్రేక్ చేసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వారిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ మూవీ కూడా చేశారు.
డియర్ కామ్రేడ్ తో రష్మిక, విజయ్ బంధం మరింత బలపడిందని అందరూ అనుకున్నారు. అంతేకాదు, వీరిద్దరూ కలిసి హాలిడే ట్రిప్ లకు కూడా వెళ్తుంటారని రూమర్లొచ్చాయి. ఎన్ని వార్తలొచ్చినా ఎప్పుడూ వీరిద్దరూ వాటిపై స్పందించింది లేదు. కానీ రష్మిక, విజయ్ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ఇప్పుడు మరోసారి వార్తలు రావడం మొదలయ్యాయి.
రీసెంట్గా రష్మిక తన అసిస్టెంట్ సాయి పెళ్లికి వెళ్లి ఆ టైమ్ లో కట్టుకున్న పసుపు రంగు శారీతో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు దిగిన లొకేషన్ లోనే విజయ్ కూడా గతంలో ఓ ఫోటోను దిగి షేర్ చేశాడు. ఇద్దరి ఫోటోలు ఒకే లొకేషన్ లో ఉండటంతో వీరిద్దరూ కలిసే ఉంటున్నారని ప్రూఫ్ లతో నిరూపిస్తున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంలో అయినా రష్మిక, విజయ్ స్పందిస్తారో లేక ఎప్పటిలానే లైట్ తీసుకుంటారో చూడాలి.






