Rashi Khanna: చీరకట్టులో రాశీ ఒంపుల్ని చూశారా?

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా (Rashi Khanna) మొదటి సినిమాతోనే ఎంతో మందిని ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన రాశీ ఇప్పుడు స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అక్టోబర్ 17న రిలీజ్ కానున్న తెలుసు కదా ప్రమోషన్స్ లో రాశీ యాక్టివ్ గా పాల్గొంటుంది.
ప్రమోషన్స్ లో భాగంగా రాశీ వివిధ అవుట్‌ఫిట్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా రాశీ ఖన్నా పర్పుల్ కలర్ శారీ కట్టుకుని ఎంతో అందంగా ముస్తాబై బిగ్ బాస్ షో కు హాజరై, సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పర్పుల్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో నడుము అందాలను హైలైట్ చేస్తూ రాశీ ఫోటోలకు ఇచ్చిన పోజులు అందరినీ ఎట్రాక్ట్ చేస్తుండటంతో నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.