యానిమల్లో రష్మిక రచ్చ మామూలుగా ఉండేట్లు లేదుగా
సౌత్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా పేరున్న రష్మిక గ్లామర్ రోల్స్ చేస్తుందే తప్పించి ఎప్పుడూ ఓవర్ ది బోర్డ్ వెళ్లి ఎక్స్పోజింగ్ చేసింది లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తప్పించి తను మిగిలిన ఏ హీరోతోనూ లిప్ లాక్ సీన్స్ లో నటించింది కూడా లేదు. విజయ్ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేసింది.
ఆ తర్వాత ఏ హీరోతోనూ రష్మిక ఇలాంటి సీన్స్ చేయలేదు. ఇప్పుడు రష్మిక నుంచి వస్తున్న తాజా సినిమా యానిమల్ లో రష్మిక క్యారెక్టర్ హాట్ గానే ఉంటుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేస్తుందంటే అందులో తప్పకుండా ఇంటిమేట్ సీన్స్ ఉండటం ఖాయం అని అందరికీ తెలుసు.
దానికి తోడు ఇది బాలీవుడ్ మూవీ. పైగా రణ్బీర్ కపూర్ హీరో. అంటే రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చాలానే ఉండే ఛాన్స్ ఉంది. దానికి తోడు ఈ సినిమాలో వయొలెంట్ ఫస్ట్ నైట్ సీన్ ఉంటుందని గత కొన్నాళ్లుగా నెట్టింట ప్రచారమవుతుంది. ఇలాంటి టైమ్ లో ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. అందులో రష్మిక, రణ్బీర్తో లిప్ లాక్ చేస్తూ కనిపించింది.
విజయ్ తర్వాత రష్మిక ఇలాంటి సీన్ చేస్తున్న హీరో రణ్బీర్నే. సినిమా ప్రమోషన్స్ కోసమే లిప్ లాక్ పోస్టర్ను వదిలారంటే సినిమాలో ఇలాంటి సీన్స్ ఇంకెన్ని ఉంటాయో అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి యానిమల్ సినిమాలో రష్మిక హాట్ గా కనిపించడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.













