యానిమల్ ఆ మైలురాయి అందుకుంటుందా?
డిసెంబర్ 1న రిలీజైన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న యానిమల్ సినిమా నాలుగో వారంలో కూడా మంచి కలెక్సన్స్ అందుకుంది. ఇప్పటికే రూ. 900 కోట్లకు దగ్గరగా కలెక్ట్ చేసిన యానిమల్ ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల టార్గెట్ ను అందుకుంటుందని బలంగా అంచనాలున్నాయి. కానీ సలార్ రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో సలార్ మానియా అన్ని చోట్లా కనిపిస్తుండగా, కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో సలార్ కు మంచి పికప్ ఉంది. తమిళనాడులో మాత్రమే అనుకున్న స్థాయిలో సలార్ దూసుకెళ్లడం లేదు. డంకీ ఆక్యుపెన్సీలు పెద్దగా లేకపోవడంతో నార్త్ లో కూడా సలార్ సినిమానే కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు.
మరో వంద కోట్లు కలెక్ట్ చేస్తే యానిమల్ రూ.1000 కోట్ల లిస్ట్ లో చేరుతుంది. అదేమీ పెద్ద కష్టం కాదు. ఇప్పటికే రూ.900 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్ కు ఇదేం పెద్ద టాస్క్ కాదు. ఎలాగూ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి సలార్ తర్వాత బెస్ట్ ఆప్షన్ గా యానిమల్ సినిమానే ఉంటుంది. కాబట్టి యానిమల్ కచ్ఛితంగా రూ.1000 కోట్ల మైలురాయిని అందుకుంటుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ ఈ టార్గెట్ అందుకోకపోయినా ఇప్పటికే యానిమల్ చాలా పెద్ద ఘనతను సాధించింది. దీంతో తర్వాత రానున్న యానిమల్ పార్క్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది.













