ఎట్టకేలకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు
నీదీ నాదీ ఒకే కథ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, తొలి చిత్రంతోనే తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్న వేణు ఊడుగుల తదుపరి చిత్రంపై నెలకొని ఉన్న సందిగ్ధత వీడిపోయింది. రానా-సాయిపల్లవి జంటగా నటించే ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే దానిపై నిన్నమొన్నటివరకు సరైన సృష్టత ఉండేది కాదు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ వర్గాల సమాచారం మేరకు..ఎట్టకేలకు ఈ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లనుంది. ప్రముఖ నటి టబు ఓ ప్రత్యేక పాత్రలో నటించే ఈ చిత్రంలో మరో ప్రముఖ హీరోయిన్ ప్రియమణి మరో కీలక పాత్ర పోషించనుంది. సురేష్‌బాబుతో కలిసి సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.













