చంద్రబాబు నాయుడు పాత్రలో రానా?
ఎన్టీఆర్ బయోపిక్ అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అతిరథ మహారథుల సమక్షంలో ఈ సినిమా వైభవంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా బాలయ్యే నిర్వహిస్తున్నారు. తేజ దర్శకత్వంలో త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్న రానా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు ఫిలింనగర్లో హల్చల్ చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడి పాత్రలో రానా నటిస్తున్నాడని టాక్. అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.













