ఆకాష్ పూరి కి అత్తగా రమ్యకృష్ణ…
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా సినిమా రొమాంటిక్. ఇటీవలే గోవాలో లాంగ్ షెడ్యూల్ను పూర్తిచేసుకున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే ఈ సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుందన్నమాట. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.













