బిబి3 టీజర్‌తో బాహుబలి 1, బాహుబలి 2ని మరిపించాడు బాలయ్య : రామ్‌గోపాల్‌వర్మ
ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేయడం రామ్‌గోపాల్‌వర్మకు అలవాటే. అదే అలవాటుతో మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఈరోజు అంటే జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా జూన్ 9న బాలకృష్ణ కొత్త సినిమాకి సంబంధించిన టీజర్‌ను బిబి3 ఫస్ట్ రోర్ పేరుతో విడుదల చేశారు. బాలకృష్ణతో సింహా, లెజెండ్ వంటి సూపర్‌హిట్ సినిమాలు చేసిన బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీజర్‌తోపాటు ఎన్.టి.రామారావు నటించిన `జగదేకవీరుని కథ` చిత్రంలోని `శివశంకరీ.. శివానందలహరి..` పాటను బాలకృష్ణ స్వయంగా పాడి విడుదల చేశారు. తన 60వ పుట్టినరోజుకు డబుల్ ట్రీట్ ఇచ్చిన బాలకృష్ణను అభినందిస్తూ ట్వీట్ చేశాడు వర్మ. అయితే అతను ఇచ్చిన కాంప్లిమెంట్ వెనుక వ్యంగ్యం దాగి ఉండడంతో బాలయ్య అభిమానులు వర్మ మీద సీరియస్ అవుతున్నారు.
ఇంతకీ బిబి3 టీజర్పైన, బాలకృష్ణ గానం చేసిన పాటపైన వర్మ ఏమన్నాడంటే.. `వావ్.. మహ్మద్ రఫీ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జూనియర్ ఆర్టిస్టుల్లా అనిపిస్తున్నారు. బాలయ్య పాట వింటుంటే శ్రోతల హార్ట్ బీట్ పెరిగిపోతోంది` అని కామెంట్ చేశాడు. ఇక టీజర్ గురించి `బాలయ్యబాబుకి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. బిబి3 టీజర్‌తో బాహుబలి 1, బాహుబలి2ని మరిపించినందుకు కృతజ్ఞతలు` అని ట్వీట్ చేశాడు.
అభిమానులు తనపై సీరియస్ అవడంపై వర్మ స్పందిస్తూ..`కొంతమంది చెడ్డవారు నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ, నేను దేవుడి మీద, బాలయ్యబాబు మీద ఒట్టేసి చెబుతున్నా.. నేను మ్యూజిక్ ప్రపంచానికి పరిచయం అయినప్పటి నుంచి ఇదే గ్రేట్ సాంగ్. ఈ పాట విని స్వర్గంలో ఎన్.టి.ఆర్. డాన్స్ చేస్తుంటాడు` అని మరోసారి సెటైర్ వేశాడు వర్మ. బాలకృష్ణ పాడిన పాట గురించి, టీజర్ గురించి వర్మ చేసిన ట్వీట్ వెటకారంగానే ఉందన్న విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ, వర్మ మాత్రం తనని తాను సమర్థించుకుంటూ తను పాజిటివ్‌గా చెప్పినా అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే భావనతో మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో విషయం మీద యాక్టివ్‌గా ఉండే వర్మకు ఈరోజు ఓ కొత్త అంశం దొరికింది. దీని మీద అందరూ చేసే కామెంట్స్‌తో కొంతకాలం అతనికీ కాలక్షేపం అవుతుంది..













