జాతీయ రహదారి ట్రైలర్ విడుదల చేసిన రామ్‌గోపాల్‌వర్మ
మధు, సైగల్ పాటిల్, మమత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జాతీయ రహదారి. నరసింహ నంది దర్శకుడు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైలర్ హృద్యంగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో మొదలైన రెండు ప్రేమకథలకు దర్శకుడు చక్కటి ముగింపు ఇచ్చారు అని తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ తీసిన శివ సినిమా స్ఫూర్తితోనే నేను సినిమా ల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ఆయన నా సినిమా ట్రైలర్‌ను ప్రశంసించడం ఆనందంగా ఉంది అని దర్శకుడు అన్నారు. ఈ నెల 10న 200 థియేటర్లలో సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, పాటలు: మౌనశ్రీ మల్లిక్.













