40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే.. నాకు విడాకులు అయ్యేవి కావు
డియర్ మేఘ అద్భుతమైన రొమాంటిక్ ఫిల్మస్. ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదు అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డియర్ మేఘ. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమాలో ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ మేఘా ఆకాష్ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే నాకు విడాకులు అయ్యేవి కావు. ఆమె చాలా క్యూట్‌గా, హోమ్లీగా ఉంది. నా సినిమాలకు సెట్ అవ్వదు. అరుణ్ అదిత్‌తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను అన్నారు.
ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇదని, తన పేరుతో సినిమా రూపొందడం ఆనందంగా ఉందని మేఘా ఆకాష్ చెప్పింది. అరుణ్ అదిత్ మాట్లాడుతూ మనసుపెట్టి చేసిన చిత్రమిది. కుటుంబమంతా కలిసిచూసేలా ఉంటుంది అని పేర్కొన్నారు. శ్రీదేవిగారితో పని చేయడం ఆర్జీవీగారికి ఎంత కిక్ ఇచ్చిందో, మేఘాతో పని చేయడం నాకు అంతే కిక్ ఇచ్చింది అన్నారు సుశాంత్ రెడ్డి. ఈ సినిమా అమ్మాయి వైపు నుంచి కథను చెబుతుంది అన్నారు అర్జున్ దాస్యన్. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, బిగ్‌బాస్ సొహెల్ తదితరులు పాల్గొన్నారు.













