రామ్ చరణ్ కు గాయం…. షూటింగ్ కు బ్రేక్
ప్రముఖ కథనాయకుడు రామ్ చరణ్ గాయపడ్డారు. ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా ఆయన కాలు బెణికి స్వల్ప గాయాలయ్యాయి. వైద్యులు పరీక్షించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌ని వాయిదా వేశారు. పుణెలో జరగాల్సిన షెడ్యూల్‌ని నిలిపివేస్తున్నట్టు, మూడు వారాల తరువాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఆర్ ఆర్ ఆర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరలో ఎన్టీఆర్, చరణ్‌లపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆ తరువాత చిత్ర బృందం పుణె వెళ్లాల్సి ఉంది. కానీ చరణ్ గాయపడటంతో ఆ షెడ్యూల్‌ని వాయిదా వేశారు.













