పుట్టిన రోజున ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ విడుదల
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్స్ విడుదల చేసే ప్రక్రియ షురూ అయింది. ఇటీవల పెళ్లి చేసుకున్న రాజమౌళి తనయుడు కార్తికేయ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ పనిలో పడ్డాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్స్ బాధ్యతను అతనే తీసుకున్నాడట. ఇందులో భాగంగా తొలి ఫస్ట్‌లుక్ రామ్‌చరణ్‌ది రాబోతోంది. వచ్చే నెలలో చరణ్ పుట్టిన రోజు ఉంది. ఆ సమయానికి ఫస్ట్‌లుక్ సిద్ధం చేయాలనేది టార్గెట్. కేవలం ఓ స్టిల్ విడుదల చేస్తారా లేక బహుబలి తరహాలో ఓ థీమ్ క్రియేట్ చేసి వీడియో విడుదల చేస్తారా అనేది ప్రస్తుతానికి సప్పెన్స్.
బాహుబలి ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్స్ వ్యవహారాలన్నీ కార్తికేయ చూసుకున్నాడు. ఓ థీమ్ ఆధారంగా వరుసగా నటీనటుల క్యారెక్టర్స్‌తో లుక్స్ విడుదల చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అదే పద్దతిని అనుసరిస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలోకి బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఎంట్రీ దాదాపు పక్కా అయింది.













