శంకర్‌పై ఫైర్ అవుతున్న చరణ్ ఫ్యాన్స్
ఏడుపొక్కటే తక్కువ అన్నట్లుంది రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి. మిగిలిన స్టార్ హీరోలందరూ గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటే రామ్ చరణ్ మాత్రం తన టైమ్‌ను వేస్ట్ చేసుకుంటున్నాడు. కానీ రామ్ చరణ్ ఇదంతా కావాలని చేయట్లేదు. దీనికి పూర్తి కారణం తనతో సినిమా చేస్తున్న గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్‌దే.
ఈ సినిమా మొదలైనప్పుడు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరిగింది. కానీ మధ్యలో ఇండియన్2 మళ్లీ సెట్స్ పైకి వచ్చే సరికి చరణ్‌తో చేస్తున్న గేమ్ చేంజర్ కు బ్రేక్ పడింది. దీంతో రామ్ చరణ్ ఈ సినిమాను ఫినిష్ చేయలేక, మరో సినిమా చేయడానికి లేక ఖాళీగా ఉంటున్నాడు. చరణ్ మాత్రమే కాదు, ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో నష్టపోతున్నాడు.
మొన్నీమధ్య కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్లే స్టార్ట్ అయి ఆగిపోయింది. మళ్లీ షూట్ గురించి వార్తలొస్తున్నాయి కానీ అందులో ఎంత వరకు నిజముందనేది తెలియదు. చరణ్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లాడు. ఇలాంటి టైమ్ లో చరణ్, ఇండియన్2 సినిమాలో క్యామియో చేస్తున్నాడని ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
అ అప్డేట్ లో నిజమెంతున్నది అనేది పక్కన పెడితే ఈ వార్తలు చూసి, చరణ్ ఫ్యాన్స్ శంకర్‌పై మండిపడుతున్నారు. సినిమా పూర్తి చేయమంటే వేరే సినిమాలో క్యామియోలు చేయిస్తావా అని శంకర్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే చరణ్ లియో సినిమాలో క్యామియో చేస్తున్నాడని వస్తున్న వార్తలకే క్లారిటీ లేక చరణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతుంటే ఇలాంటి టైమ్ లో మరో క్యామియో అంటుంటే ఆ వార్తలు విని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.













