బోయపాటి- రామ్ సినిమా ప్రీపోన్ అయ్యే ఛాన్స్?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామ్ కు, బోయపాటికి ఇదే తమ ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా మంచి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తే తెలుస్తోంది.
అయితే ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకుని ప్లాన్ చేసుకుని దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా దాదాపు ఫినిషింగ్ స్టేజ్ లో ఉందట. అందుకే సినిమాను నెల లేదంటే రెండు నెలల ముందుగానే రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
అంటే దీని ప్రకారం సినిమాను ఆగష్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అవొచ్చు. మామూలుగా ఇలాంటి క్రేజీ కాంబోలో వచ్చే సినిమాలు చెప్పిన టైమ్ కు రావడమే కష్టం అలాంటిది ఈ సినిమా నెలల ముందు రిలీజ్ కావడమంటే గ్రేట్ అనే చెప్పాలి. షూటింగ్ ఫాస్ట్ గా అవడంతో పాటూ దీనికి మరో రీజన్ ఉందట. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
బోయపాటి, బాలకృష్ణ సన్నిహిత్యం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాను ప్రీపోన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు కూడా దసరాకే షెడ్యూల్ అయింది కాబట్టి కలెక్షన్లలో షేర్ తీసుకోవడం ఇష్టం లేక బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి బోయపాటి రామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.













