Rakul Preeth Singh: మళ్లీ టాలీవుడ్ పై కన్నేసిన రకుల్?
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్(rakul preeth singh) ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సినిమాలు చేసుకుంటూ వస్తుంది. రీసెంట్ గా అమ్మడి నుంచి దే దే ప్యార్ దే2(de de pyar de2) సినిమా వచ్చింది. 2019లో వచ్చిన దే దే ప్యార్ దే(De de pyar de) మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది అన్షుల్ శర్మ(anshul sharma) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలుండటంతో రిలీజ్ ను కూడా భారీగానే ప్లాన్ చేశారు. సుమారు 400 స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ రకూ.100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా తన బాక్సాఫీస్ జర్నీని స్టార్ట్ చేసింది. మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటివరకు రూ.50 కోట్ల నెట్, రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగా వరల్డ్ వైడ్ గా రూ.76 కోట్లు కలెక్ట్ చేసింది.
పెళ్లి తర్వాత బాలీవుడ్ కే పరిమితమైన రకుల్(Rakul) తెలుగులో సినిమాలు చేసి చాలా కాలమైంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ బిజీ అవాలని రకుల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాని కోసం తన క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి మరియు మేనేజర్ల నుంచి మాత్రమే కాకుండా పలువురు దర్శకనిర్మాతలకు కూడా రకుల్ మళ్లీ టచ్ లోకి వెళ్తుందని సమాచారం. మరి రకుల్ టాలీవుడ్ లో ఏ సినిమాతో రీఎంట్రీ ఇస్తారో చూడాలి.






