యుద్ధానికి సిద్ధంకండి
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొద్దిరోజులుగా తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన తన అభిమా నటుడికి కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నాను. తమిళనాడులో 43 ఏళ్లుగా నివసిస్తున్నాను. నేను కర్ణాటక వాడినైనా మీరు నన్ను స్వాగతించి నిజమైన తమిళుడిగా ఆదరించారు. ప్రస్తుతం రాజకీయ వ్వవస్థ ఆద్వాన్నంగా తయారైంది. ఈ రాజకీయ వ్వవస్థలో మార్పు రావాల్సి ఉంది. రాజకీయాల్లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ రాజకీయ పరిస్థితి మాత్రం సక్రమంగా లేదు. ప్రజాస్వామ్యం క్షీణించింది. ఈ వ్వవస్థ మారాలి. ప్రజల్లో ఆలోచనల్లో మార్పు రావాలి.
దాదాపు ఎనిమిదేళ్ల విరామం అనంతరం రజనీకాంత్ అభిమానులను కలిశారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై గత వారంరోజులగా జోరుగా చర్చ జరుగుతుండగా తాజాగా కబాలి మాట్లాడుతూ యుద్ధం వచ్చినప్పుడు చెబుతా, సిద్ధంగా ఉండండి అని అభిమానులకు సూచించారు. దీంతో ఆయన రాజకీయరంగ ప్రవేశం దాదాపు ఖారైనట్లేనని చెబుతున్నారు. దీంతో రాజకీయ నాయకులు అప్పుడే స్పందించడం మొదలుపెట్టారు. కొందరు తలైవాపై విమర్శలు గుప్పిస్తున్నాను. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, పీఎంకే నేత ఆన్బుమణి రాందాస్‌లు రజనీ నిర్ణయాన్ని సుత్తిమెత్తగా దెప్పిపొడిచారు.













