రికార్డు సృష్టించిన 2.ఓ చిత్రం
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం మరో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాదిలో యాప్ ద్వారా మొత్తం 1780 సినిమాలకు సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అందులో అత్యధికంగా 2.ఓ సినిమా టికెట్లే అమ్ముడుపోయాయట. సెకనుకు 16 టికెట్ల చొప్పున విక్రయించినట్లు బుక్‌మై షో తెలిపింది. 2018లో ఏ సినిమాకూ దక్కని రికార్డు 2.ఓ సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత ఇంతటి స్థాయిలో రికార్డు సృష్టించిన చిత్రం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించిన పద్మావత్.













