కావాలయ్యా.. మెల్లిగా ఎక్కేస్తుంది..
కొన్ని పాటలు మొదటిసారి విన్నప్పుడు పెద్దగా ఎక్కవు. కానీ వినేకొద్దీ వినాలనిపిస్తుంది. సాంగ్ కూడా ట్రెండింగ్ లోకి వస్తుంది. ఇప్పుడు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సాంగ్ కు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది. రజినీకాంత్ జైలర్ సినిమా నుంచి మొదటి లిరికల్ గా కావాలయ్యా అనే సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సాంగ్ ఆడియన్స్ కు ఫస్ట్ లో పెద్దగా ఎక్కలేదు. కానీ ఇప్పుడు క్రమంగా ఈ సాంగ్ జనాలకు ఎక్కేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే రీల్స్, కవర్ సాంగ్స్. చూస్తుంటే కావాలయ్యా సాంగ్ ఛార్ట్ బస్టర్ అయ్యేలానే ఉంది. తమన్నా స్టెప్పులు, రజినీకాంత్ స్టైల్, అనిరుధ్ మ్యూజిక్ ఇంకేం కావాలి ఈ పాటకు అంటున్నారు ఇప్పుడు ఆడియన్స్.
జైలర్ హైలైట్స్ లో ఈ సాంగ్ కూడా ఓ హైలైట్ గా నిలవడం ఖాయమని రజినీ ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. జైలర్ నుంచి రీసెంట్గా వచ్చిన సెకండ్ సాంగ్ కూడా హిట్ అయ్యే సూచనలు ఎక్కువగానే కనిపిస్తుండటంతో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీనికి కారణం అనిరుధ్ తెలుగులో చేస్తున్న దేవర, వీడీ12 సినిమాలే. మొన్నటి వరకు జైలర్ రెస్పాన్స్ చూసి అనిరుధ్ పై నమ్మకాన్ని కోల్పోయిన వాళ్లు ఇప్పుడు అదే అనిరుధ్ ని మెచ్చుకుంటున్నారు.













