సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజనీకాంత్

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి మాస్క్ తో పాటు శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు టీకా కూడా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం టీకా వేసుకుంటున్నారు. తాజాగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. తన తండ్రి వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోను రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్‍లో షేర్ చేశారు. అన్నాతై సినిమా షూటింగ్ కోసం 35 రోజుల పాటు హైదరాబాద్‍లో ఉన్న తలైవా రీసెంట్‍గా చెన్నైకు వచ్చారు. తలైవా సతీమణి రజనీకాంత్‍కు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించగా, అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.