Nagarjuna: నా జుట్టు మొత్తం ఊడిపోయింది.. కానీ నాగ్ మాత్రం అంతే ఉన్నాడు
టాలీవుడ్ మన్మథుడు(manmadhudu), లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉన్న కింగ్ నాగార్జున(nagarjuna) ఇప్పుడు తన కెరీర్ లో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. మొన్నటికి మొన్న ధనుష్(dhanush) తో కలిసి శేఖర్ కమ్ముల(sekhar Kammula) దర్శకత్వంలో కుబేర(kuberaa) సినిమాలో దీపక్(deepak) గా మెప్పించిన నాగార్జున(nagarjuna) ఇప్పుడు సూపర్ స్టార్ తో కలిసి లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) డైరెక్షన్ లో కూలీ(coolie) అనే పాన్ ఇండియా సినిమాలో నటించారు.
ఆగస్ట్ 14న కూలీ సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో మేకర్స్ ఓ ఈవెంట్ ను నిర్వహించగా అందులో రజినీకాంత్ వీడియో ద్వారా మాట్లాడారు. కూలీ సినిమాలో సైమన్(saimon) క్యారెక్టర్ లో నాగార్జున విలన్ గా కనిపించనున్నాడని లోకేష్ చెప్పినప్పుడు తాను నమ్మలేదని, మొదట ఆ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు దాన్ని తానెంతో ఇష్టపడ్డానని, తానే ఆ పాత్ర చేయాలనేంతగా అది తనకు నచ్చిందని రజినీ అన్నారు.
సైమన్ పాత్రలో నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపించారని, 30 ఏళ్ల కిందట తామిద్దరూ కలిసి ఓ సినిమా చేశామని, నాగ్ అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారని, తనకు మాత్రం జుట్టు మొత్తం ఊడిపోయిందని, నాగ్ మాత్రం ఒరిజినల్ జుట్టుతో అలానే ఛార్మింగ్ గా ఉన్నారని, దానికి రీజనేంటని అడిగితే తాను రెగ్యులర్ గా జిమ్, స్విమ్ చేస్తుంటానని, స్ట్రిక్ట్ డైట్ తో పాటూ తన తండ్రి వారసత్వం కూడా కారణమేనని, అందుకే తాను అలా కనిపిస్తానని నాగ్ చెప్పారని తలైవా వెల్లడించారు.







