అన్నీ సినిమాలు జైలర్ కాలేవుగా
వేట్టయాన్(Vettayan) తెలుగు వెర్షన్ కు మంచి ఓపెనింగ్సే దక్కాయి. పండగ సెలవులు కావడం, దానికి తోడు సోలో రిలీజ్ కావడం వల్ల బాగా కలిసొచ్చింది. నెమ్మదిగా బుకింగ్స్ ఊపందుకున్నాయి. అయితే వేట్టయాన్ కు మిక్డ్స్ టాక్ రావడం వల్ల సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడే చెప్పలేం. బూటకపు ఎన్కౌంటర్ లలో అమాయకులు బలవుతున్నారని ఓ సీరియస్ పాయింట్ చెప్పాలనే ప్రయత్నం డైరెక్టర్ జ్ఞానవేల్(gnanvel) చాలా బలంగానే చేశాడు.
అయితే రజినీకాంత్(rajinikanth) ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అవసరం లేకపోయినా నాలుగు ఫైట్స్, రెండు సాంగ్స్ ను సినిమాలో ఇరికించారు. జైలర్(jailer) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఎక్కువ హైప్ ఉంటుందని ఇవన్నీ పెట్టుండొచ్చు. అయితే అన్ని సినిమాలు జైలర్ కాలేవనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
వేట్టయాన్ రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు. మాస్, మెసేజ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో డైరెక్టర్ తడబడిన విషయం సెకండాఫ్ లో చాలా క్లియర్ గా తెలుస్తోంది. రానా(Rana) ఎంట్రీ తర్వాత విసుగు రాకుండా కథను మలిచిన విధానం సినిమాను చాలా వరకు కాపాడింది. అయితే వేట్టయాన్ ను ఇంకొంచెం బెటర్ గా తీసుండాల్సిందనే మాటను మాత్రం కాదనలేం.













