స్టార్ యాంకర్ సుమ కొడుకు హీరో గా తొలి చిత్రం రాబోతోందా?
నటనా వారసత్వం అనేది ఈ నాటిది కాదు ముఖ్యంగా భారతీయ చలన చిత్ర సీమలో ఎందరో స్టారులు సూపర్ స్టారులు తమ పుత్రులను హీరోలుగా, హీరోయిన్ లు తమ సంతానాన్ని హీరో, హీరోయిన్లుగా సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టడం పరిపాటే అయితే ఈ ఆనవాయితీ బుల్లితెర లో తక్కువే. విషయానికొస్తే….
యాంకర్లు అనే ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. తెలుగు ప్రజలకు సుమ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గత కొన్నేళ్లుగా సుమ టాలీవుడ్ లో అత్యాధిక పారితోషకం తీసుకునే స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఇటు బుల్లితెర పై షోస్ చేస్తూనే…. ఏ సినిమా ఈవెంట్ చూసినా సుమనే కనిపిస్తుంది. చాలా మంది హీరోలకు, దర్శకనిర్మాతలకు సుమ సెంటిమెంట్ గా మారిపోయిందంటే ఆమె ప్రతిభ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. యాంకర్ గా ఉంటూనే అప్పుడప్పుడు తన పంచ్ లతో నవ్వులు పూయిస్తుంటుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తనదైన శైలి లో ఈవెంట్ ని నడిపిస్తుంది. యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తుంటుంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న సుమ వివాహ జీవితాన్ని ఆశ్వాదిస్తుంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. కుమారుడు రోషన్, కూతురు మనస్విని. రోషన్.. సుమని మించిపోయి బాగా ఎత్తు పెరిగినట్లు ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సుమ సిద్ధమవుతుందని సమాచారం. ఇప్పటికే రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో ఓ పాత్రలో కనిపించాడు. అప్పటికి రోషన్ కాస్త చిన్నవాడు. కానీ ఇప్పుడు బాగా ఎదిగాడు. ఇదే సరైన సమయమని భావించిన సుమ, రాజీవ్ లు తమ కొడుకును హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. కొత్త దర్శకుడు విజయ్ చెప్పిన రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టోరీ వీరికి నచ్చడంతో అదే కథతో రోషన్ ని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని సమాచారం.













