తన టైటిల్ను తానే వాడుకుంటున్న యాంగ్రీ మ్యాన్
మొన్నా మధ్య నితిన్(Nithin) ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man) సినిమాలో గెస్ట్ రోల్ చేసిన తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్(Rajasekhar) మళ్లీ స్క్రీన్ పై కనిపించింది లేదు. దానికి ముందు గడ్డం గ్యాంగ్(Gaddam Gang), శేఖర్(Sekhar) సినిమాలతో ప్రేక్షకులకు ముందుకొచ్చి డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. అయితే కథలో మ్యాటర్ లేకపోవడమే తప్పించి నటుడిగా మాత్రం రాజశేఖర్ పై ఎలాంటి నెగిటివిటీ లేదు.
సరైన కథ పడితే కంబ్యాక్ ఇచ్చి మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్న రాజశేఖర్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని(Pavan Sadhineni) దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు మగాడు(Magaadu) అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. 1990లో మలయాళ బ్లాక్ బస్టర్ మూన్నం మూర(Moonnam Moora) రీమేక్ గా రాజశేఖర్ హీరోగా రూపొందిన మగాడు టైటిల్ ను ఇప్పుడు మళ్లీ తనే వాడుకుంటున్నాడు.
అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్(Sr Ntr) దీవార్(Diwar) రీమేక్ సైతం మగాడు అనే టైటిల్ తోనే వచ్చింది. ఆ మధ్య మహేష్ బాబు(Mahesh Babu) కోసం ఈ టైటిల్ ను అనుకున్నారు కానీ ఎందుకో మధ్యలోనే డ్రాప్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాజశేఖరే మళ్లీ ఆ టైటిల్ ను వాడుకుంటున్నాడు. ఈ సినిమా విజయం రాజశేఖర్ తో పాటూ పవన్ సాధినేనికి కూడా ఎంతో కీలకం. ఓటీటీలో హిట్స్ అందుకుంటున్నప్పటికీ థియేట్రికల్ రిలీజ్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు పవన్ సాధినేని. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













