తన టైటిల్ను తానే వాడుకోనున్న రాజశేఖర్
టాలీవుడ్ లో 80,90ల్లో స్టార్ హీరోలకు పోటీగా హిట్లు అందుకున్న హీరోగా రాజశేఖర్ కు మంచి పేరుంది. కానీ తర్వాత నెమ్మదిగా ఆ తీవ్రత తగ్గుతూ వచ్చింది. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్ కు చెప్పుకోదగ్గ హిట్ ఒక్క గరుడవేగ మాత్రమే. చాలా కాలం తర్వాత వచ్చిన ఆ హిట్ ను కూడా తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు.
గరుడవేగ తర్వాత ఆయన నటించి కల్కి, శేఖర్ సినిమాలు డిజాస్టర్లుగా మిగలడంతో మళ్లీ ఆయన కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. దీంతో గతేడాది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో స్పెషల్ రోల్ తో రీఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో ఏం లాభం లేకపోయింది. ఇప్పుడు మళ్లీ రాజశేఖర్ హీరోగా మరో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు తన కల్ట్ సినిమాల్లో ఒక టైటిల్ ను వాడుకోనున్నాడు. అదే మగాడు. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు రాజశేఖర్ తన టైటిల్ ను తానే వాడుకోనున్నాడు. టైటిల్ ను బట్టి చూస్తుంటే కథ బాగా హీరోయిజం ఉన్న మాస్ సినిమా అయుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ అయ్యే ఛాన్సుంది.













